The Rock of Gibraltar
విరబూసిన మల్లెలా
పూరి విప్పిన నెమలిలా
చిరు దరహాసంతో
మరిపించి మురిపిస్తావు
నీ నుదురును స్ప్రుశిన్చి
నా మదిని అర్పించి
నే నిదుర మరిచి
నీకై మేఘమై వచ్చాను
నీ శ్వాసలో శ్వాసనై
నిను అల్లుకుపోయి
నా ప్రేమతో తడపాలని
నే వర్షమై కురిసాను
నీ గుండెలోతుల్లో
నే తొంగిచూస్తే
తుపాకీ గుళ్ళు
ఫిరంగి దెబ్బలు
రక్తసిక్త తనువు
తూట్లు పడ్డ హృదయం
అయినా
వణకక
తొణకక
నిటారుగా నివు నిలిచి
తోడుగా నే ఉన్నానని
నాకు ఓదార్పునిస్తావు
(Inspired by painful tunnels inside the beautiful rock)
/starpoker_100.gif)
No comments:
Post a Comment